వైరల్‌: నటి రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇళయరాజా.

SMTV Desk 2019-03-05 12:07:42  ilayaraja

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా పేరిట ఇటీవల చెన్నైలో ఓ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు తమిళ సినీ దిగ్గజాలందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ నటి రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన దర్శకుడు శంకర్‌, హీరో విక్రమ్‌లు.. ఇళయ రాజా గురించి గొప్పగా ప్రసంగించారు. ఇదే సమయంలో రోహిణి.. దర్శకుడు శంకర్‌ను అడిగిన ప్రశ్న ఇళయరాజాకు బాగా కోపం తెప్పించింది. అందరూ చూస్తుండగా.. రోహిణికి క్లాస్ తీసుకున్నారు మ్యూజిక్ మ్యాస్ట్రో. ఇంతకీ రోహిణి ఏమన్నారంటే.. ‘‘ శంకర్ గారూ.. మీరు ఇళయరాజా సర్‌తో కలిసి ఎప్పుడు సినిమా చేస్తారు? అభిమానులు మీ ఇద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు’’ అని. అయితే పక్కనే ఉన్న ఇళయరాజా ఈ ప్రశ్నకు కోపం తెచ్చుకున్నారు. అందరూ చూస్తుండగానే.. ఆమెకు క్లాస్ తీసుకున్నారు. ‘‘ నువ్వు నాకు అవకాశం ఇప్పించాలని చూస్తున్నావా? ఇది నాకు నచ్చలేదు. అయినా ఇప్పుడు సినిమా ప్రస్తావన ఎందుకు? తనకు ఎవరితో సౌకర్యంగా అనిపిస్తే వారితోనే కలిసి పనిచేస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆయనను ఎందుకు డిస్టర్బ్‌ చేస్తావ్‌?’’ అని మండిపడ్డారు. దాంతో రోహిణి కంగారుపడిపోయి.. ‘నా ఉద్దేశం అది కాదు సర్‌..’ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.