96 తెలుగు రీమేక్ టైటిల్ ఫిక్స్

SMTV Desk 2019-03-05 12:06:44  samantha, sharwanandh, janaki devi, 96 remake

చెన్నై, మార్చి 04: తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటంచిన 96 భారీ విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. నాయకా నాయికలుగా శర్వానంద్ - సమంతలను ఎంపిక చేసుకున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేయించిన దిల్ రాజు, టైటిల్ కూడా తెలుగులో ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా కోసం జాను .. జాను అలియాస్ జానకి అనే రెండు పేర్లను పరిశీలించారు. తాజాగా జానకీదేవి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు .. ఆ రోజున టైటిల్ లోగోను రిలీజ్ చేయడం జరగొచ్చని చెప్పుకుంటున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి.