శివాలయాల్లో భక్తుల కిటకిట

SMTV Desk 2019-03-05 11:42:05  shivaratri..

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరభద్రస్వామి గుడిలో మహాశివరాత్రి వేడుకలు ఇవాళ తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయమే స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి వేడుకలను ప్రారంభించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ అయింది. ఇక ఏపీలోని గోదావరి నదిలో భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించి మహా శివుని దర్శనం కోసం బారులు తీరారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం శివ నామస్మరణతో మారు మోగుతోంది. పంచారామాల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన పాలకొల్లు శ్రీశైల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. యాత్రికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తగు భద్రతా చర్యలు చేపడుతున్నారు.