అభినందన్ స్టైల్ ఫాలో అవుతున్న యువతరం

SMTV Desk 2019-03-04 19:07:36  Abhinandan, Whiskers, Saree, New Trend

న్యూఢిల్లీ, మార్చి 4: రెండు రోజుల్లోనే యావత్ భారత్ కు హీరో అయిన పైలట్ అభినందన్ వర్ధమాన్ కు బ్రహ్మరథం పడుతున్నారు భారతీయులు. పాక్ చెర నుండి విడుదలైన ఈ వింగ్ కమాండర్ క్రేజ్ ఇప్పుడు బాగా పెరిగింది. యువకులందరు అతనిలాగే మీసాలు పెంచాలని ప్రయత్నిస్తున్నారు. అతివలు అతని ముఖచిత్రం ప్రింట్ చేసిన చీరలు ధరించేందుకు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. ఆడవాళ్లలో ఈ ట్రెండ్ ను గమనించిన సూరత్ వస్త్ర వ్యాపారులు అభినందన్ ముఖచిత్రంతో చీరలను రూపొందిస్తున్నారు.

అయితే ఈ ప్రింటెడ్ చీరలు మార్కెట్లోకి వచ్చిన వెంటనే అమ్ముడైపోతున్నాయట. దాంతో విక్రయదార్లు సూరత్ బట్టల మిల్లులకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారట. ప్రస్తుతం గుజరాత్ లో ఈ ట్రెండ్ నడుస్తుంది. రాబోయే రోజుల్లో దేశం మొత్తం పాకిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ చీరలపై అభినందన్ చిత్రంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా ముద్రించినట్టు దీనికి సంబంధించిన ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.