శివ‌రాత్రి నాడు ఓం న‌మఃశివాయ అనే పంచాక్ష‌రీ మంత్రాన్ని జపించాలి

SMTV Desk 2019-03-04 19:00:14  Shivaratri..

మహాశివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ చేసేందుకు కొన్ని నియ‌మాలు ఉన్నాయి అవేమిటంటే…
1. ఉప‌వాసం ఉండే ముందు రోజు, ఉప‌వాసం త‌రువాతి రోజు మాంసాహారం తిన‌రాదు. మ‌ద్య‌పానం చేయ‌రాదు.

2. ఉప‌వాసం ఉండే రోజు సూర్యోద‌యం కాక‌ముందే నిద్ర లేవాలి. త‌లంటు స్నానం చేయాలి. శివాల‌యం వెళ్లి స్వామిని ద‌ర్శించుకోవాలి. రోజంతా శివ‌నామ స్మ‌ర‌ణ చేయాలి.

3. రాత్రి పూట శివ‌లింగానిఇ పూజ‌లు చేస్తూ జాగారం ఉండాలి. పూజా విధానం, మంత్రాలు తెలియ‌క‌పోయినా స‌రే.. బిల్వార్చ‌న చేయ‌వ‌చ్చు. అభిషేకం చేయ‌వ‌చ్చు.

4. మ‌హాశివ‌రాత్రి రోజున ఉప‌వాసం ఉండ‌డం అంటే.. కొంద‌రు అన్నం, చ‌పాతీల‌కు బ‌దులుగా పండ్ల‌ను విపరీతంగా తింటారు. అది మంచిది కాదు. ఉప‌వాసం అంటే.. ఉప‌వాస‌మే.. ఉప‌వాసం.. అంటే అస‌లు ఏమీ తిన‌వ‌ద్ద‌ని, తాగ‌వద్దని అర్థం. కానీ దాన్ని ప్ర‌స్తుతం మార్చేశారు. ఉప‌వాసం అంటే.. పండ్ల‌ను తిన‌వ‌చ్చ‌నే భావ‌న చాలా మందిలో ఉంది. అది స‌రికాదు. ఉప‌వాసం.. అంటే అస‌లు ఏమీ తిన‌కూడ‌దు..!

5. జాగ‌ర‌ణ పేరిట కొంద‌రు రాత్రంతా సినిమాలు చూస్తారు. కొంద‌రు ఆట‌లు ఆడుతారు. ఇంకా కొంద‌రు వేర్వేరు ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతారు. ఇది స‌రికాదు. జాగ‌ర‌ణ అంటే.. రాత్రంతా మేల్కొని శివ‌నామ స్మ‌ర‌ణ చేయాలి. లేదా శివ‌లింగాన్ని పూజించాలి.

6. మ‌హాశివరాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. ఎన్నో వేల సార్లు దైవాన్ని పూజించినా ద‌క్క‌ని పుణ్య ఫ‌లితం ఒక్క రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ‌తో ద‌క్కుతుంద‌ట‌.

7. శివ‌రాత్రి నాడు ఓం న‌మఃశివాయ అనే పంచాక్ష‌రీ మంత్రాన్ని రోజంతా స్మ‌రించాలి.

8. మ‌హాశివ‌రాత్రి రోజు రాత్రి పూట జాగ‌ర‌ణ చేసి ఉద‌యాన్నే శివాల‌యం సంద‌ర్శించి ప్ర‌సాదం తీసుకుని ఇంటికి వ‌చ్చాకే ఉప‌వాసం ముగించాలి. అలాగే శివ‌రాత్రి రోజు జాగ‌ర‌ణ చేసిన వారు మ‌రుస‌టి రోజు రాత్రి వ‌ర‌కు నిద్రించ‌రాదు. అలా చేస్తేనే సంపూర్ణ ఫ‌లితం ద‌క్కుతుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.