శివరాత్రి కి మీరు ఇలాచేయండి ...

SMTV Desk 2019-03-04 18:54:07  Shivaratri..

ప్రతీఒక్కరిని కాపాడే ఆ దేవుడిని ఎంతో భక్తితో పూజించాలి. ముఖ్యంగా రేపు రాబోయే శివరాత్రి పూజా విధానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.. శివరాత్రి పూజ, నవరాత్రి పూజలానే దీక్షగా చేయాలి. ఈ రెండింటికి ఓ సంబంధంముంది. అదేంటంటే.. రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తూ శివుడే అడగ్గా.. అమ్మవారు అందుకు ప్రతిఫలంగా.. నవరాత్రుల పూజలు కోరుకున్నట్లు చెబుతారు.

భోళా శంకరుడు అభిషేకప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే శివరాత్రి ముందురోజు నుంచే ఒక్కపూట భోజనం చేస్తారు. ఫలహారాలు తీసుకుంటూ దీక్ష చేయాలి. అంటే.. బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు..

వేకువ జామున పూజ చేసి.. మధ్యాహ్నాం, సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చేయాలి. రాత్రంతా చేయాలి. పూజ, అభిషేకం చేయాలి. ప్రతిజాముకి పూజ, అభిషేకం చేసి సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు చేసి సంధ్యావందనం చేసి అన్నీ రకాల పుష్పాలు, అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి.అనంతరంబ్రహ్మణులు లేదా బంధుమిత్రులకు భోజనం పెట్టి.. మనం తీసుకోవాలి. .