హాలీవుడ్ రేంజ్ లో షేడ్స్ అఫ్ సాహో 2...

SMTV Desk 2019-03-04 16:35:42  shades of saaho..

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ఈ రోజు రానే వచ్చింది.ఇది వరకే “షేడ్స్ ఆఫ్ చాఫ్టర్ 1” మేకింగ్ వీడియోతో ఎంత భీబత్సం సృష్టించారో అందరికి తెలుసు.దీనితో తర్వాత రాబోయే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 మేకింగ్ వీడియో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరు ఆశగా ఎదురు చూసారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సాహో టీమ్ ఈ రోజు రెండో వీడియోను వదులుతామని ముందే ప్రకటించేసింది.ఇక దానితో డార్లింగ్ అభిమానులు ఆనందనానికి హద్దుల్లేవు..అదే ఊపులో ఈ రోజు ఉదయం ఆ వీడియోని విడుదల చేసారు.

మొదటి మేకింగ్ వీడియో ఒకెత్తు అయితే ఈ వీడియో ఇంకో ఎత్తనే చెప్పాలి.ఇప్పటికే ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ ప్రమాణాలతో సుజీత్ టీమ్ తెరకెక్కిస్తున్నారు అని అందరికీ తెలిసినదే.ఇప్పుడు వీరి కష్టమంతా కనిపిస్తుంది.ఈ వీడియో చూసినట్లయితే అసలు ఇది మన తెలుగు సినిమానా లేక ఏదైనా హాలీవుడ్ యాక్షన్ సినిమానా అన్న అనుమానం రాక తప్పదు.ప్రతీ షాట్ మరియు యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయని ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది.మరి మొత్తం సినిమాలో సుజీత్ ఇంకెంత విషయం దాచారో చూడాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగక తప్పదు.