తొమ్మిదేళ్ళ తరువాత ఒకే బహిరంగ సభలో మోదీ, నితీష్

SMTV Desk 2019-03-04 16:22:29  indian prime minister, narendra modi, bihar chief minister, nitish kumar, bjp

పాట్నా, మార్చ్ 3: పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరగనున్న సంకల్ప్ ర్యాలీ లో మోదీతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికలో పాల్గొనడం విశేషం. 2010 తర్వాత ఒకే బహిరంగ సభలో ఉభయులూ కలిసి పాల్గొనడం ఇదే మొదటిసారి. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే సభా స్థలిలో కాంగ్రెస్ జన్ ఆకాంక్ష ర్యాలీ నిర్వహించింది. కాగా, బీజేపీ సంకల్ప్ ర్యాలీలో ఎల్‌జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ కూడా పాల్గొంటారని, పుల్వామా దాడి అనంతరం మోదీ తీసుకున్న చర్యలపై పూర్తి విశ్వాసాన్ని, ధీమాను వేదికపై పాల్గొనే నేతలు వ్యక్తం చేయనున్నారని ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు చెబుతున్నారు. ఇంతవరకూ గాంధీమైదాన్‌లో జరిగిన ర్యాలీల్లోనే అతిపెద్ద ర్యాలీని చూడబోతున్నామని ఎల్‌జేపీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరస్, బీజేపీ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద రాయ్ తెలిపారు. ఆర్‌జేపీ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఈ ర్యాలీతో గట్టి సమాధానం ఇవ్వబోతున్నామని అన్నారు.