నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారీ లాల్‌

SMTV Desk 2019-03-04 16:13:09  bjp, shyam bihari lal

న్యూ ఢిల్లీ, మార్చ్ 03: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరిదాపూర్ నియోజకర్గ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీలాల్ ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు నియోజకవర్గ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ప్రజల సమస్యలపై చర్చిస్తుండగా.. ఓ యువకుడు లేచి.. ‘ఎందుకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదు?’ అని అందరి ముందు ఎమ్మెల్యేను నిలదీశాడు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘నోటికొచ్చిట్లు మాట్లాడకు. మీ గ్రామం అభివృద్ధి చెందలేదా? విద్యుత్ వచ్చిందిగా.. రోడ్లు వేశాంగా.. అభివృద్ధి అంటే ఏంటి? ఇంకే కావలి? వేశ్యలను తీసుకొచ్చి డ్యాన్స్‌లు చేయించాలా? అని నోరుపారేసుకున్నారు. దీంతో గ్రామస్తులందరూ ఎమ్మెల్యే శ్యాహ బిహారీలాల్‌పై నిప్పులు చెరిగారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..