స్టార్ హీరో సినిమా ... అక్కడ హిట్.. ఇక్కడ ప్లాప్ ..

SMTV Desk 2019-03-04 15:58:13  ajith, viswasam

కోలివుడ్ సూపర్ స్టార్ అజిత్ కి అభిమానుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ లో మాత్రం ఈ హీరో సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు.

ఇక్కడ చిన్న హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కూడా అజిత్ సినిమాలకు రావడం లేదు. అజిత్ నటించిన విశ్వాసం సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి తరువాత అక్కడ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమానే.

ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి మార్చ్ 1న విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్ లలో సినిమా విడుదలైంది. కానీ మొదటి రోజు రాబట్టిన షేర్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే. ఇక్కడ సినిమా రివ్యూ నెగెటివ్ గా రావడం, పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అలరించలేకపోయింది

లాంగ్ రన్ లో ఈ సినిమా రెండున్నర కోట్లు రాబడితేనే ఇక్కడ నిర్మాతలు నష్టాల నుండి బయటపడగలరు. కానీ సినిమా పరిస్థితి చూస్తుంటే ఆ నెంబర్ దాటడం కష్టమనే అనిపిస్తోంది.