షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2.. ముహూర్తం ఫిక్స్‌

SMTV Desk 2019-03-02 18:54:01  shades of saaho

హైదరాబాద్, మార్చ్ 02: బాహుబలి లాంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్‌ వండర్‌ సాహో. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాహుబలి స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నుంచి మరో అప్‌ డేట్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్‌ను షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 పేరుతో రిలీజ్ చేసిన చిత్రయూనిట్, మార్చి 3న శ్రద్ధా కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా చాప్టర్‌ 2ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా రిలీజ్‌ టైంను కూడా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే ... మరి షేడ్స్ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2 ఎలా ఉంటాదో రేపటి వరకు ఆగాల్సిందే ..