బాలయ్య వెనక్కి తగ్గాడు..?

SMTV Desk 2019-03-02 18:27:45  Balayya, Balakrishna,

నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంగా చేసిన సినిమా ఎన్.టి.ఆర్ బయోపిక్ నిరాశపరచడంతో డీలా పడ్డాడు. కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలు డిజాస్టర్ అవడం వల్ల ఎన్.బి.కే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రస్తుతం సినిమాలు నిర్మించే ఆలోచన వెనక్కి తీసుకున్నాడట బాలకృష్ణ. అసలైతే బోయపాటి శ్రీను సినిమా బాలయ్య నిర్మించాల్సి ఉంది. కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ విఫలమవడంతో ఆ ప్రయత్నం చేయట్లేదట.

బయట నిర్మాతలతో ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ అవగా నిర్మాత కుదిరితే త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ సిం హా, లెజెండ్ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. మరి హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.