ఆ ఛాన్స్ హృతిక్ కి మాత్రమే అంటున్న తమన్నా

SMTV Desk 2019-03-02 16:14:45  Tamannah, Hritik Roshan

హైదరాబాద్, మార్చి 02: వెండితెరపై స్కిన్ షోకి ఏమాత్రం వెనకాడని తమన్నా ముద్దు సీన్లలో మాత్రం నటించనని ముందు నుంచి చెబుతుంది. ఇప్పటివరకు తాను పని చేసిన సినిమాలకు ఇదే షరతులు విధించినట్లుగా చెప్పింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్స్ అనేవి కామన్ అయిపోయాయి. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత లిప్ లాక్ సన్నివేశాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో తమన్నా మాత్రం ఇప్పటికీ ఆన్ స్క్రీన్ ముద్దు సీన్లలో నటించనని అంటోంది.

అయితే ఈమె బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటిస్తానని చెప్పింది. అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే గనుక తెర మీద ముద్దులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడనని అంటోంది. హృతిక్ అంటే తనకు ఎంతో అభిమానమని, అతడితో నటించే ఛాన్స్ వస్తే చాలాని చెప్పింది. కొంతకాలం క్రితం హ్రితిక్ ని చూసినప్పుడు తమన్నాకి అసలు మాటలే రాలేదట. చివరకు అతడి దగ్గరకి వెళ్లి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పిందట.