అల్లు అర్జున్ తో మరోసారి రొమాన్స్ ...

SMTV Desk 2019-03-02 15:22:01  Allu arjun, Pula Hegde, Katherine, Trivikram

హైదరాబాద్, మార్చి 02: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫిక్స్ చేసారు. దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కోసం కేథరిన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె గతంలో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో , సరైనోడు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇటు పూజా హెగ్డే కి .. అటు కేథరిన్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, త్రివిక్రమ్ - బన్నీలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.