వైరల్ పోస్ట్ : పంటలు పండించేందుకు 'రైతులు కావలెను'

SMTV Desk 2019-03-02 10:59:15  Farmers, Tamilnadu, Keerai kadai

తమిళనాడు, మార్చి 02: దేశానికి రైతే వెన్నెముక అంటారు. అతని వ్యవసాయం చెయ్యకపోతే దేశానికి తిండి దొరకదు. అలాంటిది ఇప్పుడు రైతులు కూడా వ్యవసాయం చేయడం మానేసి నగరాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక అందరు సాఫ్ట్‌వేర్, వైట్‌కాలర్ ఉద్యోగాలు చేస్తే దేశానికి దేశానికి ఆకలి బాధ తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కీరైకడై సంస్థ సృజనాత్మకత రంగరించి సాగులో దూసుకుపోతుంది.

సేంద్రియ పంటలు, ఇతర నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు అందించడం ఈ సంస్థ ఉద్దేశ్యం. అయితే ఇప్పుడు ఈ సంస్థలో పంటలు పండించడానికి రైతులు కరువయ్యారట. దీంతో రైతులు కావలెను అని ప్రకటన ఇచ్చింది. నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల జీతం ఇస్తామని, ఉచిత భోజనవసతి కల్పిస్తామని తెలిపింది. సమాజానికి సహజసిద్ధ ఆహారాన్ని అందించే రైతులు కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.