'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల తేదీ

SMTV Desk 2019-02-28 18:25:02  Ram gopal varma, Lakshmi NTR

హైదరాబాద్, ఫిబ్రవరి 28:రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందింది. ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి పరిచయం .. వాళ్ల వివాహం .. ఆ తరువాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

మహానాయకుడు లో కొన్ని సంఘటనలను తెరపై ఆవిష్కరించే సాహసం బాలకృష్ణ చేయరనే టాక్ ముందుగానే వచ్చింది. అలాంటి సంఘటనలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించడానికి వర్మ ఎంతమాత్రం వెనుకాడడు. తాను చెప్పదలచుకున్న విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకిపోడు. అందువలన లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అందరిలోను ఆసక్తి వుంది. ట్రైలర్ తో పెరిగిన అంచనాలను వర్మ ఎంతవరకూ అందుకుంటాడో చూడాలి మరి.