ప్రతీ రూపాయికి లెక్క ఉంది : కౌశల్‌

SMTV Desk 2019-02-28 17:18:02  Kaushal, Kaushal Army, Contraversy

హైదరాబాద్, ఫిబ్రవరి 28:బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌కు.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన కౌశల్‌ ఆర్మీకి మధ్య వివాదం ముదురుతోంది. ఫౌండేషన్‌ డబ్బును కౌశల్‌ ఇష్టం వచ్చినట్టుగా వృధా చేస్తున్నాడంటూ ఆరోపిస్తు ఆర్మీ సభ్యులు ఎదురు తిరగటంతో కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ గురించిన అన్ని వివరాలు జెన్యూన్‌గా ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాను. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు.

నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్‌బాస్‌ గేమ్‌ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. అలాంటిది నా మీద ఓ మీడియా సంస్థ (సాక్షి కాదు) నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. 20 సంవత్సరాలు ‌కష్టపడితే నాకు వచ్చిన మంచి అవకాశం బిగ్ బాస్ 2. సామాన్యుడైన కౌశల్ ఈ స్థాయికి రావటం ఇష్టం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్‌. అన్ని వివరాలు ఫేస్‌బుక్‌లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్‌ క్రైమ్‌ పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసాన’ని తెలిపారు.