నాని క్రికెట్‌ మ్యాచ్ అయిపోయినట్టేనా?

SMTV Desk 2019-02-28 14:51:30  NANI, JERSEY, SPORTS

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ‘జెర్సీ’ మూవీ కోసం క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన నాని మ్యాచ్‌ని ముగించారు. గేమ్‌లో బంతులను ఎలా బౌండరీ దాటించారో తెలియాలంటే ఏప్రిల్‌ 5 వరకూ ఆగాల్సిందే మరి. నాని హీరోగా మళ్ళీ రావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడీవి ప్రసాద్, నాగవంశీ నిర్మించారు.

ఈ సినిమాలో క్రికెట్‌ ప్లేయర్‌ ‘అర్జున్‌’ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం పూర్తయింది. "ఇప్పుడే ‘జెర్సీ’ లాస్ట్‌ షాట్‌ పూర్తి చేశాం’" అంటూ నాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. అనిరుథ్‌ స్వరాలు అందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్యాంగ్‌లీడర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.