సమంత లేటెస్ట్ ఫోటో షూట్

SMTV Desk 2019-02-27 16:46:11  Samantha, Naga Chaithanya, Photoshoot

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత నటనకు ప్రాధాన్యం కలిగిన పాత్రలను పోషిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె పెళ్ళైన యువతిగా సాంప్రదాయంగా కనిపిస్తుంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందు సమంత తనలోని గ్లామర్ యాంగిల్‌కి పదునుపెడుతూ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇటీవల సమంత ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ లోని ఫోటోలను సమంత తన ఇన్‌ స్టాగ్రామ్‌ ప్రొఫైల్ లో షేర్ చేసింది. మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్‌‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సమంత.