కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం

SMTV Desk 2019-02-27 13:24:40  Mig Fighter Jet, Crash, Pilot

శ్రీనగర్, ఫిబ్రవరి 27: భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా, తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బుద్గాంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ యుద్ధ విమానం గగన విహారం చేస్తుండగానే కుప్పకూలింది.

ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిన ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న సైన్యం అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టింది. ఈ ఘటనపై అధికారులు విచారిస్తున్నారు. వాతావరణం అనుకూలించకే విమానం కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు.