మరో రికార్డు బ్రేక్ చేయడానికి బుమ్రా సిద్దం...!

SMTV Desk 2019-02-26 18:58:16  Jasprit Bumrah, Indian cricketer, India vs australia, 2nd t20

బెంగళూరు, ఫిబ్రవరి 26: టీం ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా టీ20ల్లో మరో రికార్డు బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బుధవారం బెంగుళూరు వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టీ20లో బుమ్రా ఈ రికార్డును సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన బుమ్రా…టీ20ల్లో 50 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బుమ్రా 41 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రాది మూడోస్థానం. ఇక బుమ్రా రెండు వికెట్లు తీస్తే..భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్‌ 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అశ్విన్‌ కంటే ముందుగానే బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది.