సర్జికల్ స్ట్రయిక్స్.. నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం' :రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2019-02-26 16:49:37  super star mahesh babu, Jr ntr

హైదరాబాద్, ఫిబ్రవరి 26: భారత సర్జికల్ స్ట్రయిక్స్ పై తెలుగు సినీ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా, పాక్ లోకి దూసుకెళ్లి దాడులు చేసి పెద్దఎత్తున ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు.

మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అన్నారు. ఇదే దాడులపై స్పందించిన ఎన్టీఆర్ "మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా" అనగా, "సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్... జై హింద్" అని రాజమౌళి, "భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా... జై హింద్" అని రామ్ చరణ్ ట్వీట్లు పెట్టారు. కమల్ హాసన్, అఖిల్, వరుణ్ తేజ్, ఉపాసన ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ఏయ్ పాకిస్తాన్, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం అంటూ ట్వీట్ చేశాడు.