సర్జికల్ స్ట్రయిక్స్ గురించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపత్రిలకు వివరించిన మోదీ

SMTV Desk 2019-02-26 15:23:41  Narendra Modi, Ramnath Kovind, venkaiah Naidu, Attack, Meeting

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైనికులు నిర్వహించిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వాయుసేన విమానాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు, ఆదేశ ప్రధాన భూభాగమైన ఖైబర్ ఫక్తూంక్వా వరకు వెళ్ళాయి. కాగా జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపత్రి వెంకయ్యనాయుడులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించి పూర్తి వివరాలను మోదీ వారికి వివరించారు.

మోదీ ఈ ఉదయం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పాటు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.