'డబుల్ ఇస్మార్ట్ శంకర్' కూడా రాబోతున్నాడు...?

SMTV Desk 2019-02-26 11:40:06  ismart Shankar, Ram, Puri jagannath, Charmee, Double ismart Shankar

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ . పూరి తన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తుండగా, చార్మీ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే నిర్మాతలు పూరి - చార్మీ కలిసి డబుల్ ఇస్మార్ట్ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు.

ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి అప్పుడే వాళ్ళు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. చార్మీ నిర్మాతగా .. పూరి దర్శకుడిగా ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. అయితే రామ్ తో చేస్తోన్న ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితేనే దానికి సీక్వెల్ ఉంటుందనీ, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇలా డబుల్ ఇస్మార్ట్ టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటారని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.