బాలకృష్ణ సర్ ను చూస్తుంటే బాధగా ఉంది: కంగనా రనౌత్

SMTV Desk 2019-02-26 11:29:34  Kangana Ranaut, Manikarnika, NTR Kathanayakudu, Mahanayakudu, Balakrishna, Krish

హైదరాబాద్, ఫిబ్రవరి 26: మణికర్ణిక విషయంలో కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరు సైలెంట్ గానే ఉన్నా...ఇప్పుడు మళ్ళీ తాజాగా కంగనా క్రిష్ పై తీవ్ర విమర్శలు చేసింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రథమ భాగం కథానాయకుడు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మహానాయకుడు పై మరింత దృష్టి పెట్టి రూపొందించి ఇటీవల విడుదల చేశారు. కానీ ద్వితీయ భాగం కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం వెనకబడింది.

ఈ విషయంపై కంగనా మాట్లాడుతూ... " ఎన్టీఆర్ మహానాయకుడు కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను మణికర్ణిక ప్రాజెక్టును స్వీకరించినపుడు నాపై ఎటాక్ చేసి.. నన్ను హింసించి నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాబందుల్ల నన్ను పీక్కుతిన్నారు. మరిప్పుడేమంటారు? క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా మణికర్ణిక పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర్య సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందించినందుకు నాకు చాలా బాధగా ఉంది" అని కంగనా వ్యాఖ్యానించింది.