హైదరాబాద్, ఫిబ్రవరి 25: జి.కొండలరావు దర్శకత్వం వహించిన సినిమా డిసెంబర్ 31 వర్మ గారి బంగ్లా సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా హైదారాబాద్‌లో ఈ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ "స్టోరీ లైన్ విన్నాను. సస్పెన్స్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్. ముఖ్యంగా సినిమాకు ఏసీపీ రవీంద్ర పాత్ర పవర్‌ఫుల్‌గానే కాకుండా సినిమాకే హైలైట్‌గా నిలవనుంది" అని అన్నారు.
శ్రీ గౌతం క్రియేషన్స్ పతాకంపై గణగళ్ల మానస సమర్పణలో జి.లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దర్శకుడు జి.కొండలరావు మాట్లాడుతూ "ఈ సినిమా అరకు, వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప్రతి డిసెంబర్ 31కు ఎంతో మంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలకు గురవుతున్నారు. అసలు అవి ఎలా జరుగుతున్నాయి? వాటిని ఏ విధంగా ఆపవచ్చు. హత్యలు చేస్తుంది ఎవరు? దానిని గుర్తించడం కోసం స్పెషల్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగి అసలు హంతకులను ఎలా పట్టుకున్నారు? అన్నది చిత్ర కథాంశం" అని తెలిపారు