'118' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులు వీరే....

SMTV Desk 2019-02-25 14:01:38  118 pre release event, Kalyan Ram, Shalini Pandey, Nivedha Thomas, Mahesh Koneru, NTR , Balakrishna

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు బాలకృష్ణ, ఎన్టీఆర్ అతిధులుగా రాబోతున్నారని చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఈరోజు హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. కేవీ గుహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలిని పాండే, నివేదా థామస్‌ హీరొయిన్లుగా నటించారు.

ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్‌ షో అమెరికాలో ఈనెల 28న నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్‌ సంస్థ విదేశాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 118 ను మార్చిలో విడుదల చేయనున్నారు.