హైదరాబాద్ కు చేరుకోనున్న మహేష్ బాబు విగ్రహం

SMTV Desk 2019-02-22 17:11:55  Mahesh Babu, AMB Cinemas, madame tussauds, Hyderabad, Mahesh Babu Statue

హైదరాబాద్, ఫిబ్రవరి 22: లండన్ లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తుతం సింగపూర్ లోని మ్యూజియంలో భద్రపరిచారు. అయితే ఈ నెల 25న ఈ విగ్రహం హైదరాబాద్ చేరుకోనుంది. దీన్ని హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శించనున్నారు. ఈ విగ్రహాన్ని స్వయంగా మహేష్ బాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఇక దక్షిణాదిన ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాందిచుకున్న రెండో హీరోగా మహేష్ రికార్డులకు ఎక్కబోతున్నాడు. మొత్తానికి మహేష్‌తో ఫోటో దిగని వాళ్లు..అచ్చం ఆయన పోలి ఉండే ఈ విగ్రహంతో ఎంచక్కా సెల్సీలు తీసుకోవచ్చు. విగ్రహావిష్కరణ అనంతరం ఈ మైనపు బొమ్మను సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు.