ప్రియా ప్రకాష్ క్రేజ్ కాస్త తగ్గినట్టుంది...

SMTV Desk 2019-02-13 21:19:07  Priya prakash varrier, Lovers day, Allu arjun

హైదరాబాద్, ఫిబ్రవరి 13: కేవలం ఒక్క నైట్ లోనే యావత్ ప్రపంచాన్ని ఊపేసిన వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ తాజా సినిమా లవర్స్ డే . ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కూడా మొన్నటివరకు బాగానే చేశారు. ఏకంగా అల్లు అర్జున్ చేత ఆడియో రిలీజ్ చేయించిన చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ దగ్గరపడే సరికి లైట్ తీసుకున్నారనే చెప్పాలి. సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో గాని ప్రస్తుతానికి క్రేజ్ అయితే ఏమి లేదు.

మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలని అందరిలో ఆసక్తి రేగుతోంది. ఈపాటికి బుకింగ్స్ లో రచ్చ చేస్తుందన్న సినిమా ఇంకా ఆ ఖాతాను ఫుల్ ఫీల్ చేయలేకపోతోంది. గూగుల్ ని గత ఏడాది ఉక్కిరిబిక్కిరి చేసి టాప్ 1లో నిలిచిన ప్రియా వారియర్ క్రేజ్ ఎంతవరకు నిలిచిందో రేపటితో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.