నందమూరి అభిమానులని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్...!

SMTV Desk 2019-02-13 13:52:42  Lakshmis NTR, Ramgopal varma, NTR Biopic, Nandmuri Fans, Nara chandrababu, Nara lokesh

హైదరాబాద్, ఫిబ్రవరి 13: సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. “ఎన్టీఆర్ అసలు కథ” అంటూ వివాదాస్పద అంశాలే కథా వస్తువుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ.

ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి తరచూ ఎదో ఒక వివాదాస్పద ట్వీట్లు చేస్తూ, వార్తల్లో నిలుస్తున్నాడు ఆర్జీవి, ఒకరకంగా చెప్పాలంటే సినిమాకు ఇది ఫ్రీ పబ్లిసిటీలా ఉపయోగపడింది అనటంలో ఆశ్చర్యం లేదు. అందులోను ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలై బాక్సాఫీస్ ఆశించినంత స్థాయిలో ఆడకపోవడం వర్మ వ్యంగ్యాస్త్ర జ్వాలలకు ఆజ్యం పోసినట్లయింది.

అప్పటి నుండి గ్యాప్ లేకుండా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ “వెన్నుపోటు” అంటూ వరుస సెటైర్లు వేస్తున్నారు వర్మ. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నందమూరి అభిమానులను టార్గెట్ చేసారు, రేపు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ విడుదల సందర్బంగా ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొడుతూ వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.

” ఎన్టీఆర్ అబద్దపు అభిమానులారా, వెన్నపోటుకు నిజమైన అభిమానులారా” అంటూ టీడీపీ శ్రేణులను,ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ, టీజర్ వస్తోంది సిద్ధంగా ఉండండంటూ ఛాలెంజ్ చేసారు. మరీ, రేపు విడుదలవబోతున్న టీజర్ ఎలా ఉండబోతుందో, దానికి అభిమానుల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.