'సైరా' రేంజ్ ఎక్కడా తగ్గట్లేదు...!

SMTV Desk 2019-02-12 23:33:31  Ram charan, Chiranjivi, Surender reddy, Syeraa narashimhareddy

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 తరువాత నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి అంచనాలకు మించే తెరకెక్కిస్తున్నారని ఇప్పుడు సినీ వర్గాల నుంచి సమాచారం.

కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమి లేకపోవడంతో మన దగ్గర ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదని అందరు అనుకుంటున్న ఈ తరుణంలో ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారట. తెలుగు నేలకి చెందిన మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఈ సినిమా మొదలు పెట్టిన మొదట్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. క్రమేపి పెద్దగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. పలు సర్వేలలో తేలింది ఏమిటంటే ఎలాంటి అప్డేట్లు లేకపోయినా సరే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపైనే అధికంగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని బట్టి “సైరా” పై అంచనాలు ఎక్కడా చెక్కు చెదరకుండా పదిలంగానే ఉన్నాయనే చెప్పాలి.