సీక్రెట్ గా దర్శకత్వం వహించబోతున్నా...!

SMTV Desk 2019-02-08 15:02:36  Tharun Bhaskar, Pelli chupulu, Vijay devarakonda

హైదరాబాద్, ఫిబ్రవరి 08: విజయ్ దేవరకొండకి బ్రేక్ ఇచ్చిన పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారనున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ నిన్న ప్రారంభం అయింది. సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు.

సమీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ కి జోడీగా అనసూయ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఎప్పుదూ కెమెరా వెనక వుండి ఒక్కసారిగా కెమెరా ముందుకు రావడం కొత్తగా ఉందని ఆయన అన్నారు. హీరోగా ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ దర్శకత్వం చేస్తానని ఆయన అన్నారు.

సీక్రెట్ గా తను తర్వాత దర్శకత్వం వహించబోతున్న సినిమాకి కథ రాసుకుంటున్నానని తరుణ్ అన్నారు. హీరోగా ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడిగా మరో సినిమా మొదలు పెడతానని స్పష్టం చేసారు.