బాబుపై నాగబాబు సెటైర్లు

SMTV Desk 2019-02-08 14:01:19  Nagababu, Chandrababu, My channel Na istam

హైదరాబాద్, ఫిబ్రవరి 08: మెగా బ్రదర్ నాగబాబు యు ట్యూబ్ లో మై ఛానల్, నా ఇష్టం పేరుతో ఒక ఛానల్ ని ప్రారంభించాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, రాజకీయ నాయకులపై సెటైర్లు వేయడమే ఈ చానెల్ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా నాగబాబు ఎన్నో పొలిటికల్ పంచ్‌లు, సెటైర్లు వీడియో ల రూపంలో రిలీజ్ చేస్తున్నాడు.

గతంలో జగన్, నారా లోకేష్ లను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబును టార్గెట్ చేసారు.ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే జైలులో పెడతారా? అని బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. బీజేపీ తీరు చూస్తుంటే తన రక్తం మరుగుతోందని విమర్శించారు.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు సెటైరికల్ వీడియోను విడుదల చేశారు. "పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది. థ్యాంక్యూ" అని ఆ వీడియోలో నాగబాబు సెటైర్ వేసారు.