చనిపోగానే గొప్పోడు అయిపోతాడా..?....'యాత్ర'పై నెటిజన్ల కామెంట్లు

SMTV Desk 2019-02-08 13:08:58  Yatra movie, YS Rajashekhar reddy, Trolls on yatra movie, Twitter posts

హైదరాబాద్, ఫిబ్రవరి 08: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర . ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వర్గం నుండి ఈ సినిమాకు మంచి రేస్పాన్సే వస్తుంది కాని మరికొంత మంది ఈ సినిమాపై విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని భావించి చిత్ర దర్శకుడు రిలీజ్ కి ముందే ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానులు మాటల యుద్ధానికి దిగకుండా వారిని గౌరవించాలని అన్నారు. కానీ నెటిజన్లు మాత్రం యాత్ర ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక వర్గపు ఆడియన్స్ ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. బాలకృష్ణపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్ ని కూడా వదలలేదు. వైఎస్సార్ మహానుభావుడా..? అతి పెద్ద అవినీతి పరుడు చనిపోగానే గొప్పోడు అయిపోతాడా..? అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు సినిమాలో పాజిటివ్ కంటెంట్ మాత్రమే చూపించడంపై మండిపడ్డారు. ఒక వర్గం తప్పితే ఎవరూ ఈ సినిమా చూడరని, చేసిన దోపిడీలు.. మూటగట్టుకున్న పాపాలు చూపించారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.