బ్రహ్మితో బన్నీ ఫన్నీ ఫోటో....

SMTV Desk 2019-02-08 10:39:36  Allu Arjun, Bramhanandam, Twitter post

హైదరాబాద్, ఫిబ్రవరి 08: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రమిఖ హాస్య నటుడు బ్రహ్మానందాన్ని స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలిసారు. ఇటీవల బ్రహ్మానందం అస్వస్తతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు బైపాస్ సర్జెరీ జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి రియల్‌ ఐరన్‌ మ్యాన్. దృఢమైన మనసున్న మనిషి. ఫన్నీ అండ్‌ ఫియర్‌లెస్‌.

నా కిల్‌బిల్‌ పాండేను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఫోటోకి కాప్షన్ ఇచ్చారు. బన్నీతో కలిసి దిగిన ఫోటోలో బ్రహ్మానందం చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. వీరిద్దరూ చాల సినిమాల్లో కలిసి నటించారు. రేసుగుర్రం సినిమాలో కిల్ బిల్ పాండేగా బహ్మానందం అల్లు అర్జున్ తో కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.