'కేజిఎఫ్ 2' లో బాలీవుడ్ డాన్...

SMTV Desk 2019-02-07 17:36:32  KGF Part 1, Yash, Sanjay dutt, Director Prashanth neel

హైదరాబాద్, ఫిబ్రవరి 07: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కడ చూసిన కేజిఎఫ్ మానియా నడుస్తుంది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలో సంచలన విజయాన్ని అందుకుంది. కేజిఎఫ్ చూసిన పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇలాంటి సినిమాలో నటించాలని చూస్తున్నారట. అయితే బాలీవుడ్ డాన్ సంజయ్ దత్ కు ఈ సినిమాలో అవకాశం రాగానే సింగిల్ సిట్టింగ్ లోనే గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డాన్ లను మించిన డాన్ అవ్వాలని కథానాయకుడు కనిపించే విధానం KGFలో మాస్ ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేసింది. అలాంటి సినిమాలో భగ భగ మండే సూర్యుడి ఉగ్రరూపం తరహాలో ఉండే పాత్ర కోసం సంజయ్ ను రెడీ చేస్తున్నారు.

సినిమాలో హీరోని దర్శకుడు విలన్స్ తోనే స్ట్రాంగ్ గా ఎలివేట్ చేశాడు. ఇక ఇప్పుడు సంజయ్ పాత్రతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రయోగమే చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. త్వరలోనే KGF సెకండ్ చాఫ్టర్ షూటింగ్ ను మొదలెట్టి వీలైనంత త్వరగా పనులన్నిటిని ముగించుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 2020లో సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. 150 కోట్లకు పైగా సెకండ్ పార్ట్ కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.