నాకు వాళ్లంటే అస్సలు నచ్చదు...!

SMTV Desk 2019-02-07 14:52:14  Anchor rashmi, SP Balasubrahmanyam, Nagababu, Rashmi twitter account

హైదరాబాద్, ఫిబ్రవరి 07 : టీవీ యాంకర్ రష్మి ఓ పక్క బుల్లితెరపై మెరుస్తూనే మరోపక్క తన అభిమానులతో సోషల్ మీడియాలో సంభాషిస్తూ ఉంటుంది. ఈ మధ్య ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు హీరోయిన్ల వస్త్రాధారణపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు బాలుకి మద్దతు పలికినా మరికొంత మంది మాత్రం బాలుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలుకి వ్యతిరేఖంగా మాట్లాడారు. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు మీకు లేదంటూ క్లాస్ పీకారు. నాగబాబు మాటలను యాంకర్ రష్మి సపోర్ట్ చేసింది.ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన నాగబాబుకి థాంక్స్ కూడా చెప్పింది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మగవాళ్ల డ్రెస్సింగ్ లో మీకు నచ్చని అంశాలు ఏంటని? రష్మిని అడిగారు. దానికి స్పందించిన రష్మి.. నాకు షార్ట్స్ వేసుకొని కాళ్లపై హెయిర్ తో తిరిగేవారంటే నచ్చదు. కట్ బనియన్లు వేసుకొని తన శరీరంపై ఉన్న హెయిర్ ని ఎక్స్ పోజ్ చేస్తే నచ్చదు. హాఫ్ షర్ట్స్ వేసుకొని తిరిగే అబ్బాయిలు కూడా నచ్చరు. బీచ్ లలో చొక్కా లేకుండా తిరిగే వాళ్లంటే అసలు నచ్చదు. నా లిస్ట్ చాలా పెద్దది అంటూ చెప్పుకొచ్చింది.