'తుగ్లక్'కి జోడీగా సమంత...?

SMTV Desk 2019-02-07 14:23:46  Samantha, Sharwanand, Vijay Sethupathi, Thuglak

హైదరాబాద్, ఫిబ్రవరి 07: సినిమా కథ విషయంలో సమంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. విభిన్నమైన పాత్రలకు ఎక్కువ ప్రాదాన్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె యూ టర్న్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమా 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమాలో సమంతకు జోడీగా శర్వానంద్ నటించబోతున్నాడు. 96 తో పాటు నందినిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సమంత ఒప్పుకుంది.

సమంత తమిళంలో విజయ్ సేతుపతి జోడీగా తుగ్లక్ అనే సినిమాలో నటించబోతుందని తాజా సమాచారం. ఆ సినిమా దర్శకుడు సినిమా కథను సమంతకు వినిపించగా ఆమె పాజిటివ్ గానే స్పందించింది. తన నిర్ణయాన్ని త్వరలో చెప్తానని అన్నట్టుగా సమాచారం. తుగ్లక్ కథ విభిన్నంగా ఉండడం, విజయ్ సేతుపతి క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని సమంత ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.