విడుదలకు ముందే 26 అంతర్జాతీయ అవార్డులు...!

SMTV Desk 2019-02-07 10:26:29  Tolet, Trailer, International awards, Cheliyan, Santhosh sriram

హైదరాబాద్, ఫిబ్రవరి 07: తమిళ సినిమా టూలెట్ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. దర్శకుడు చెలియన్ రూపొందించిన ఈ చిత్రంలో సంతోష్ శ్రీరామ్, సుశీల, ఆదిరా పాండిలక్ష్మి, ధరుణ్‌ బాలా ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే 80 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్‌ అయ్యింది. అంతేకాకుండా 26 అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది.

తమిళనాడులోని చెన్నైలోని ఒక కుటుంబం అద్దె ఇంటిని వెతకడానికి పడే కష్టాలే ఈ సినిమా కథ. దర్శకుడు చెలియన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, కథ అందించాడు. ఆ కుటుంబం పడే కష్టాలను దర్శకుడు ఎంతో సహజంగా తెరపై చూపించాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికి తమిళనాడు ప్రజలను ఆకట్టుకుంటుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా టూలెట్ సినిమా ట్రైలర్ ను ప్రశంసించాడు. మంచి సినిమాలకు ఎప్పుడు పరిశ్రమలో ఆదరమ ఉంటుందని అన్నారు. దాంతోపాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.