చెన్నై, ఫిబ్రవరి 06: కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ విజయ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇదివరకు అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్, తెరి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు హట్రిక్ కోసం వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాలో తెరకెక్కనుంది. అయితే ఇందులో విజయ్ ఒక ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నాడు. గతంలో అమిర్ ఖాన్ నుంచు వచ్చిన లగాన్ సినిమా ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేసిందో అదే స్థాయిలో ఈ సినిమా కూడా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని సమాచారం.
సంగీత దర్శకుడు రెహమాన్ కూడా ఇటీవల అదే విషయాన్నీ చెప్పాడు. సినిమాలో కొంత మంది స్టార్ నటీనటులు నటించబోతున్నారు. ఇకపోతే సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. విజయ్ నటిస్తోన్న పాత్ర పేరు మైకేల్ అని తెలిసింది. కోచ్ గా యువతరంకు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ లను ఇస్తూ విజయ్ అగ్రెసివ్ గా కనిపిస్తాడని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త లుక్ లో విజయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తాడని టాక్. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.