వంద మంది ఫైటర్లతో చరణ్ యాక్షన్...!

SMTV Desk 2019-02-06 15:26:56  RRR, Jr. NTR, Ram Charan, Rajamouli, action scene, DVV Danayya

హైదరాబాద్, ఫిబ్రవరి 06: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇటీవల ఈ సినిమా రెండవ షెడ్యుల్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ నుంచి ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోగా, రామ్ చరణ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే దానికి సంభందించిన ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో వంద మంది ఫైటర్లు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.