శవాన్ని క్లయిమ్ చేసుకోండి :భారత్

SMTV Desk 2017-08-02 12:31:22  abu dajana, lashkar terrorist abu dajana encounter, terrorist encounter

ఢిల్లీ, ఆగష్టు 2: జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా హక్రిపొరలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజానాతో పాటు ఆరీఫ్‌ను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. దుజనా ఈ ఏడాది మేలో భద్రతా దళాలు చుట్టుముట్టినప్పుడు తప్పించుకున్నాడు. అయితే అబూ తల్లిదండ్రులు తమ కుమారుడిని చివరి సారి చూస్తారన్న ఉద్దేశంతో మృతదేహాన్ని తీసుకువెళ్లాలని ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌ను భారత్ కోరింది. ఇలా ఓ ఉగ్రవాది మృతదేహాన్ని క్లయిమ్ చేసుకోవాలని భారత్ దాయాది దేశం పాక్ ను కోరడం ఇదే మొదటిసారి. పాక్ హై కమిషన్ కార్యాలయానికి వచ్చిన కాశ్మీర్ ఐజీపీ మునీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, దుజానా మృతదేహాన్ని పాక్ అధికారులు తీసుకెళ్లకుంటే, తామే అంత్యక్రియలు పూర్తి చేస్తామని అన్నారు. దుజానాతో పాటే ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన ఉగ్రవాది ఆరిఫ్ లాలిహారీ అంత్యక్రియలు జరుగగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ యువత వచ్చి భారత్‌కు వ్యతిరేకంగా నినదించారని సమాచారం.