శబరిమల ఆలయ సంప్రోక్షన్ని తప్పుపట్టిన టీబీడీ అధ్యక్షుడు

SMTV Desk 2019-02-06 07:43:21  Bindu, Kanaka Durga, Rajivara, Pinarai Vijayan, Padma Kumar

తిరువనంతపురం, ఫిబ్రవరి 06: గత నెలలో 2వ తేదిన కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి బిందు, కనకదుర్గ లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. వారు ప్రవేశించిన తరువాత ఆలయ ప్రధాన పూజారి రాజీవరు, గర్భగుడి తలుపులు మూసివేసి, సంప్రోక్షణం జరించారు. ఈ ఘటన సుప్రీమ్ కోర్ట్ తీర్పునకు వ్యతిరేకంగా ఉందని బిందు కోర్ట్ ను కూడా ఆశ్రయించింది. ఈ చర్యపై వివరణ ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును(టీబీడీ) ఆదేశించింది.

ఇందువల్ల టీబీడీ రాజీవరుకు నోటీసులు జారీ చేయగా, ఆలయం ఎన్నో రకాలుగా అశుభ్రతకు గురవుతుంది. అనేక రకాల మలినాలు గర్భాలయంలోకి చేరుతుంటాయి. వాటిని తొలగించే క్రమంలో మేము రెండు రోజులకు ఒకసారి సంప్రోక్షణ చేస్తుంటాము. జనవరి 2న జరిగిన శుద్ధి కార్యక్రమం కూడా అందులో భాగమే. మహిళలు వచ్చినందుకు మేమేమీ ఆలయాన్ని శుద్ధి చేయలేదు అని చెప్పారు. కాగా, టీబీడీ అనుమతి తీసుకోకుండా పూజారి ఆలయాన్ని సంప్రోక్షణ చేశాడని, ఇది సరైన పద్ధతి కాదని టీబీడీ అధ్యక్షుడు పద్మకుమార్‌ తెలిపారు.