మెగా ఫ్యామిలీని తాకిన నాగబాబు వివాదం

SMTV Desk 2019-02-05 16:25:24  Nagababu, YouTube channel, Nenu na avineeti, skit, SP Balasubrahmanyam, Mega family, Niharika konidela, Social media comments

హైదరాబాద్, ఫిబ్రవరి 05: మెగా బ్రదర్ నాగాబబు వివాదాలు రోజురోజుకి పెరగడంతో అవి కాస్త మెగా ఫ్యామిలీ ఆడపడుచులకు తాకాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై చేసిన కామెంట్స్ కు స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు నాగబాబు. దాంతో ఎస్పీబి కామెంట్స్ ఖండించేవే కావచ్చు కానీ, మీరు స్పందించిన విధానం బాగోలేదంటూ సోషల్ మీడియా జనం ఆయనపై విరుచుకుపడుతున్నారు. వరుస ట్రోల్స్ తో నాగబాబునిఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇందులో ఆయన పర్శనల్ ఫ్యామిలీ మాటర్స్ ని కూడా తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు కూతురు నీహారికను ఈ వివాదంలోకి లాగుతూ ఆమెపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. ఈ వివాదంలో బాలసుబ్రహ్మణ్యంని కొందరు సమర్దిస్తుండగా, నాగబాబుకి కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ గొడవలోకి నాగబాబు ఇంటి ఆడపిల్లలను లాగడం ఊహించని పరిణామం. మరి దీనిపై కూడా వీడియో వదులుతాడేమో చూడాలి!