అభిమానులకు కృతఙ్ఞతలు తెలిపిన మెగా హీరో...

SMTV Desk 2019-02-05 12:36:46  Ram charan, Vineya vidheya rama, Boyapati seenu, Facebook

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రంగస్థలం సినిమా తరువాత అంతటి విజయాన్ని అందుకుంటుందని భావించి బోయపాటి శీను దర్శకత్వంలో చేసిన వినయ విదేయ రామ సినిమాను పోయిన సంక్రాంతికి విదుదల చేశాడు రాం చరణ్. అయితే ఆ సినిమా ఒక్కసారిగా ఊహించని డిజాస్టర్ టాక్ రావడంతో తలకిందులయ్యాడు చరణ్. ప్రస్తుతం చరణ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నిర్మాతగా తన తండ్రి మెగాస్టార చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే వినయ విదేయ రామ ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో తన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఈ సినిమా ఫ్లాప్ పై రామ్ చరణ్ అభిమానుల కోసంఓ లెటర్ రాశాడు. ప్రియమైన అభిమానులకు మరియు ప్రేక్షకులకు నా పట్ల మరియు నా సినిమాల పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు అంటూ మొదలుపెట్టాడు.

వినయ విధేయ రామ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అంటూ చెప్పారు. నిర్మాత దానయ్య గారు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనని, సినిమాను నమ్మిన పంపిణీదారులు, బయ్యర్లకు కృతజ్ఞన్యుడనై ఉంటానని చెప్పారు. ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపజేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు చూపిస్తోన్న ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో అందరికీ నచ్చే సినిమాలు చేయటానికి కృషి చేస్తానని చెప్పారు.