ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతివ్వని బెంగాల్ ముఖ్యమంత్రి

SMTV Desk 2019-02-03 16:04:01  Mamatha Banerjee, Yogi Adhithya Nath, Mruthyumjay Kumar, Helicopter Landing

కోల్‌కతా, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపి నేతలకు వరుసగా షాక్ ఇస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించింది. తాజాగా ఈరోజు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు. బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో ఆదివారం సాయంత్రం జరిగే ర్యాలీ కోసం యోగి రావాల్సి ఉండగా తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అందువలనే ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరిస్తున్నమని వెల్లడించింది.

బీజేపీ పాపులారిటీ చూసి మమతా బెనర్జీ ఇర్ష్య పడుతున్నారని అందుకే, యోగి ఛాపర్ దిగేందుకు అనుమతి ఇవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు. యోగి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నట్లు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తో యోగి హెలికాప్టర్ బీఎస్‌ఎఫ్‌కు చెందిన రాయ్‌గంజ్ క్యాంప్‌లో ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన బాలూర్‌గాట్‌కు రానున్నారు.