హైదరాబాద్, ఫిబ్రవరి 2: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగ ఓ మీడియాకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. డెన్ వేర్ ఫర్ ప్యూమ్ ప్రమోషన్ లో పాల్గొన్న మహేశ్ ఆ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి వెళ్లారు. అక్కడికి మీడియా కూడా వచ్చింది. మహేష్ ని రకరకాల ప్రశ్నలతో రిపోర్టర్లు చిట్ చాట్ చేశారు.
అందులో భాగంగా ఓ రిపోర్టర్ మీకు ఇప్పటికి చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు. అందులో మీ భార్య కాకుండా ఎవరి ప్రపోజల్ మీకు బాగా నచ్చిందని అడిగారు. దీంతో వొక్కసారి మహేష్ సీరియస్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావ్ నాకు పెళ్లైంది. నా వైఫ్ మాత్రమే నాకు సర్వం, తన ప్రపోజల్ ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది.