అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు : మోడీ

SMTV Desk 2019-02-02 15:35:21  Narendra Modi, Mamatha Benarjee, NDA

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: లోక్ సభ ఎన్నికల కొరకు ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌లో ప్రచారాన్ని మొదలుపెట్టిరు. శనివారం థాకూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నరు. ఈ సందర్భంగా ఎన్డీయే సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ ముసాయిదా బిల్లుకు మద్దతునివ్వాలని తృణమూల్ కాంగ్రెస్‌ను మోదీ కోరారు. సభలో మాట్లాడుతూ మోదీ మమతా బెనర్జీని విమర్శించారు. దేశంలో తమకు దక్కుతున్న ఆదరణ చూసి మమతా వొర్వలేకపోతున్నారని, అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

గ్రామీణ ప్ర‌జ‌లు మ‌మ‌తా పాల‌న‌లో క‌ష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వొకప్పుడు దేశాన్ని వదిలి వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి హిందువులుగా, సిక్కులుగా, క్రిస్టియన్లుగా, పార్సీలుగా దేశానికి వస్తున్నారని, వాళ్లంతా మనవాళ్లు కాబట్టే వారికి పౌరసత్వాన్ని కల్పించేందుకు ముసాయిదా బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. బెంగాల్ ప్రజలంతా దానికి సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఆరంభం మాత్రమేనని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తీసుకొచ్చే బడ్జెట్‌లో రైతులు, యువత, ఇతర అన్ని వర్గాలకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని అన్నారు.తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా 12కోట్ల రైతులు, 30-40కోట్ల మంది కార్మికులు, 3కోట్ల మంది మధ్య తరగతి ప్రజలకు లబ్ది చేకూరుతుందని మోడీ స్పష్టం చేశారు.