చెన్నై, ఫిబ్రవరి 2: 96 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి ఆ సినిమా డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చారంట. త్రిష, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. అంతేకాక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిమేక్ అవుతుంది. అయితే విజయ్ సేతుపతి ఈ దర్శకునికి బైక్ గిఫ్ట్ గా ఇచ్చారని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు ప్రేమ్ కుమార్. ఆ బైక్ విలువ రూ. 3 లక్షలని సమాచారం. విజయ్ 0096 అనే నంబరుతో బైక్‌ను రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు చెబుతున్నారు. విజయ్‌కు బైక్‌లంటే ఆసక్తిని, ప్రత్యేకించి రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఇష్టమని చెబుతున్నారు.