ఇంటివాడు కాబోతున్న టెన్నిస్‌ ప్లేయర్‌

SMTV Desk 2019-02-02 13:19:20  Rafael nadal, Maria Francisca Perello, Marriage, Tennis player

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రఫెల్‌ నాదల్‌ మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ త్వరలో వో ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ ఆటగాడు తన స్నేహితురాలైన మేరీ పెరెల్లోతో గత 14 ఏళ్లుగా ప్రేమలో ఉండి చివరికి పెళ్ళికి సిద్దమయ్యాడు. ఈ మధ్య ఇద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్న నాదల్‌ మొత్తం 17 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. దాదాపు వీరి మధ్య ప్రేమాయణం గత 14 ఏళ్లుగా సాగుతుంది. ఏటిపి టెన్నిస్‌ ఈవెంట్లు ముగిసిన తర్వాత అక్టోబరు లేదా నవంబరులో నాదల్‌ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. నాదల్‌ అకాడమీలో పెరెల్లో పనిచేస్తుంది.